Cyclone: ఏపీకి మరో తుపాను ముప్పు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో వర్షాలు
Cyclone: ఏపీకి మరో తుపాను ముప్పు
ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశముందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. అలాగే.. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు గజగజలాడిపోతున్నారు. నిన్న రాత్రి అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్పం. ముంచంగిపుట్టులో 5.8, చింతపల్లిలో 6.8, డుంబ్రిగుడ, పాడేరులో 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.