Amaravathi: ఆలయాల్లో అన్నదానం స్థానంలో భోజన ప్యాకెట్లు

Amaravathi: పలు దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేస్తూ ఏపీ దేవాదాయశాఖ కీలక నిర్ణయం

Update: 2021-03-22 13:35 GMT

అన్నదానం:(ఫోటో ది హన్స్ ఇండియా) 

Amaravathi: రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేస్తూ ఏపీ దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతన్ననేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరో వైపు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాల్లో కూడా అన్నదానాన్ని నిలిపివేస్తున్నారు. అయితే, అన్నదానం ఆగిపోయిన ఆలయాల్లో భక్తులకు మరో రూపంలో భోజనం అందజేయనున్నారు. భోజనం ప్యాకెట్లను ఇవ్వనున్నారు. ఈ ప్యాకెట్లో సాంబారు అన్నం, దద్దోజనం ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తారని తెలిపారు. కరోనా నేపథ్యంలో భక్తులు గుమిగూడకుండా, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Tags:    

Similar News