నా ప్రాణాలకు ముప్పు ఉంది.. రక్షణ కల్పించండి లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీ లేఖ

Update: 2020-06-22 02:00 GMT
Raghu Rama Krishnam Raju (File Photo)

సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, ఎంపీగా నియోజకవర్గానికి వెళ్లి ప్రజాసమస్యలు పరిష్కరించలేని పరిస్థితి నెలకొందని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన నియోజకవర్గానికి వెళ్లి ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు భద్రత కావాలని ఆయన లేఖలో పేర్కన్నారు.

ఈ నేపథ్యంలో లేఖలో తన నియోజకవర్గ పరిధిలోకి అడుగుపెడితే దిష్టిబొమ్మలు కాల్చినట్లుగానే తనని నిలబెట్టి కాల్చేస్తామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరికలు జారీచేశారని, పోలీసులు వారిని అడ్డుకోవడం లేదని ఆయన లేఖలో ప్రస్తావించారు.

ఇటీవల ఏపీలో జరిగిన సంఘటనలు, తదనంతర పరిణామాలను మీ దృష్టికి తీసుకువస్తున్నా. శ్రీవారికి హిందూ భక్తులు దానంగా ఇచ్చిన ఆస్తులను విక్రయించాలని ఇటీవల టీటీడి ప్రతిపాదించింది. లక్షలాది మంది భక్తులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరే కించారు. ఈ ప్రతిపాదనపై మీడియాలో ద్వారా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాను.

టీటీడీ భూములు విక్రయుంచడం వల్ల కలిగే పరిణామాల గురించి ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా కలసి చెప్పాలని ప్రయత్నించినా.. సీఎం నాకు అపాయిట్మెంట్ దొరకలేదు. దీని తర్వాత మరికొన్ని సమస్యలు తలెత్తాయి. రాష్ట్రంలో ఇసుక ధరలు ఏకంగా 600 శాతం పెరగడం వల్ల నిర్మాణపనులు స్తంభించిన విషయాన్ని ప్రసార మాధ్యమల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లాను. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే బెదిరించారని రఘురామకృష్ణరాజు స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకండా లేఖతోపాటు తనకు వ్యతిరేకంగా జరిగిన దిష్టిబొమ్మల దహనానికి సంబంధించి వార్తల క్లిప్పింగ్‌లను అందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె.నారాయణనాయక్‌కు ఎంపీ ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలంటూ తన పీఏ ద్వారా పోస్టులో ఫిర్యాదులు పంపించారు. బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News