ఏపీ మండలి ఉపఎన్నికలో ఎమ్మెల్సీగా డొక్కా ఏకగ్రీవం..

ఏపీ శాసన మండలి సభ్యునిగా వైసిపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు.

Update: 2020-06-25 11:40 GMT
Dokka Manikya Varaprasad elected as MLC

ఏపీ శాసన మండలి సభ్యునిగా వైసిపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. ఒకేఒక ఎమ్మెల్సీ స్థానానికి అధికార వైసీపీ తరపున డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

శాసన మండలిలో తన బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ తొలి అడుగు వేసింది. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కోటాలో జరగనున్న శాసనమండలి ఉపఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేరును అధిష్టానం ఖరారు చేసింది. మండలి ఉపఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి గురువారం చివరిరోజు. దీంతో వైసీపీ అభ్యర్థిగా డొక్కా ఒక్కరే గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆయన్ను ప్రతిపాదిస్తూ వైసీపీ 10మంది ఎమ్మెల్యేల సంతకాలు చేశారు.

ఈ మండలి ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఆ పార్టీకి శాసనసభలో తగిన బలం లేకపోవడమే దీనికి కారణం. ఆ పార్టీ నుంచి మరెవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయలేదు దీంతో డొక్కా ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. కాగా అయిన స్థానాన్ని ఆయనతోనే వైసీపీ భర్తీ చేసింది. ఒక్క స్థానమే ఖాళీ కావడం, అభ్యర్థిని గెలిపించుకునేంతటి బలం లేకపోవడంతో టీడీపీ ఉపఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉంది.

డొక్కా మాణిక్య వరప్రసాద్ మరో మూడేళ్ల పాటు శాసనమండలిలో సభ్యునిగా ఉంటారు. 2023 మార్చి 29వ తేదీన ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామనే నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఆయన ఆ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం డొక్కా మాణిక్యవరప్రసాద్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

అసెంబ్లీలో భారీగా మెజారిటీ ఉన్నప్పటికీ.. శాసన మండలిలో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన వైసీపీ.. కీలక బిల్లుల విషయంలో ప్రతిపక్షం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ముందు నిర్వహించబోయే ఎన్నికలను ఏకపక్షంగా మార్చుకోబోతోంది. దీనికి మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో ఎన్నికే ఖాయంగా కనిపిస్తోంది.


Tags:    

Similar News