Andhra Pradesh Weather Report: ఏపీ లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

Andhra Pradesh Weather Report: ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణం రిపోర్టును భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది.

Update: 2020-07-11 08:09 GMT
ap weather report

Andhra Pradesh Weather Report: ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణం రిపోర్టును భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. తూర్పు ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు చత్తీస్ గఢ్ మీదుగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 48 గంటలలో పాలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణం కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు మోస్తరు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు సోమవారం కూడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాయతవరణ కేంద్రం స్పష్టం చేసింది.

మరోవైపు దక్షిణ కోస్తా ఆంధ్ర లోను ఇదే వాతావరణం కనిపిస్తుందని.. దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లగే కొన్నిచోట్ల భారీ వర్షాలు మూడు రోజులపాటు కురిసే అవకాశం ఉందన తెలిపింది. ఇటు రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. అయితే కొన్నిచోట్ల మాత్రమే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందాని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.


Tags:    

Similar News