సంతృప్తినిచ్చిన నైరుతి రుతుపవనాలు

-సంతృప్తినిచ్చిన నైరుతి రుతుపవనాలు -మెల్లగా మొదలై కురిసిన జోరు వానలు -సెప్టెంబర్‌ నెలలో దంచికొట్టింది -వందేళ్ల రికార్డు వాన -ఒక్క నెలలోనే 247 మిల్లీమీటర్ల వర్షపాతం -సగటు వర్షపాతం కంటే 48% అధికం -1994 తర్వాత భారీ వానాకాలం -సాధారణస్థాయికి మించిన వానలు -నిన్నటితో అధికారికంగా ముగిసిన వానాకాలం -అయినా చురుకుగానే రుతుపవనాలు -నాలుగైదు రోజుల్లో పూర్తిగా ఉపసంహరణ

Update: 2019-10-01 04:18 GMT

నైరుతి రుతుపవనాలు సంతృప్తినిచ్చింది. ఐఎండీ, స్కైమేట్‌ వంటి ప్రైవేటు సంస్థల వేసిన అంచనాలను మించిన వర్షాలు కురిశాయి. దంచికొట్టిన వర్షాలు రికార్డును సృష్టించాయి. రుతుపవనాల ఆగమనం కాస్త తటపటాయించిన మరింత పుంజుకుని దేశమంతటా వానలు దంచికొట్టాయి. పలురాష్ట్రాల్లో విస్తారంగా కురిసినా ఉత్తరాది రాష్ర్టాలు మాత్రం భారీ వర్షాలతో చిగురుటాకుల వణికిపోయాయి.

1994 తర్వాత సుమారు 25 ఏళ్ల రెయిన్‌ సీజన్‌లో ఈస్థాయిలో వర్షాలు నమోదుకావడం ఇదే ఫస్ట్‌ అని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అంతేకాకుండా 1901 నుంచి పోల్చితే మూడో గరిష్ఠ వర్షపాతం నమోదైనట్లు రికార్డులు తెలిపాయి. ప్రత్యేకించి సెప్టెంబర్‌లో అనేకచోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. ఈ సీజన్‌ సెప్టెంబర్‌లో గత 102 ఏళ్లలో ఎన్నడూ లేనంతస్థాయిలో గరిష్ఠ వర్షపాతం నమోదైంది. ఫలితంగా జూన్‌-సెప్టెంబర్‌ వానాకాలం సీజన్‌ అధిక వర్షపాతం సీజన్‌గా నిలిచింది. సగటు వర్షపాతం కంటే 48 శాతం అధికంగా కురిసింది. మూడు దశాబ్దాల్లో 1983 తర్వాత ఇవే అత్యధిక వర్షపాతాలుగా నమోదై రికార్డును సృష్టించాయి.

వాతావరణశాఖ అంచనా ప్రకారం నిన్నటితో వానాకాలం సీజన్‌ ముగిసిపోయినా దేశంలోని అనేకప్రాంతాల్లో ఇంకా రుతుపవనాలు చురుకుగానే కొనసాగతున్నాయి. రుతుపవనాల ఉపసంహరణ విషయంలో ఈ సీజన్‌ రికార్డు నెలకొల్పిందని ఐఎండీ వర్గాలు తెలిపాయి. రుతుపవనాల ఉపసంహరణ జాప్యంలో బహుశా ఇదే సుదీర్ఘకాలమని చెబున్నాయి. రుతుపవనాల ఉపసంహరణకు మరో నాలుగైదు రోజులు పడుతుందని ఐఎండీ వర్గాలు స్పష్టం చేశాయి.   

Tags:    

Similar News