Andhra pradesh sand policy : స్వంత అవసరాలకు ఇసుక ఉచితం..ఇలా అయితేనే!

Andhra pradesh sand policy: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సొంత అవసరాలు, పేదల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు మాత్రమే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని స్పష్టం చేసింది.

Update: 2020-06-26 02:05 GMT

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం(Andhra Pradesh sand policy) తీసుకుంది. ఇక నుంచి సొంత అవసరాలు, పేదల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు మాత్రమే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని స్పష్టం చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది.1,2,3 ఆర్డర్‌ రీచ్‌లలో మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పింది.

ఇసుక విధానంపై స్పష్టతనిస్తూ..అనుమతి ఉన్న రిచుల్లో ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు  ఉచితంగా తీసుకెళ్లొచ్చని, ట్రాక్టర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బలహీన వర్గాల గృహ నిర్మాణం, సహాయ, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఉచితంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. వేరే చోట నిల్వ చేసి, విక్రయిస్తే చర్యలు తీసుకుంటారు. సొంత అవసరాలకే ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు అమలు చేయనున్నారు.

ఎవరైనా సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లానుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోరిన వారి వివరాలు నమోదు చేసుకుని, ఎలాంటి ఫీజు లేకుండా సచివాలయాలు అనుమతి పత్రం ఇస్తాయి. అలాగే కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించిన మరో అధికారి అయినా అనుమతి ఇవ్వొచ్చు. ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు.  

Tags:    

Similar News