అధికారులు, ఉద్యోగులు రాష్ట్రంలోనే ఉండాలి : ఏపీ ప్రభుత్వం ఆదేశం

అధికారులు, ఉద్యోగులు రాష్ట్రంలోనే ఉండాలి : ఏపీ ప్రభుత్వం ఆదేశం
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బయట ప్రాంతాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉండాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో పెరుగుతున్న కోరోనా కేసులు...

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బయట ప్రాంతాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉండాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో పెరుగుతున్న కోరోనా కేసులు నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది. అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా క్వారెంటైన్ లో ఉంచాలనే నిబంధనను మరోసారి స్పష్టం చేసింది. కరోనా వైరస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను తాకుతుండటంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రెడ్ జోన్ ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్ కేటాయించింది. ఏపీ సచివాలయంలో కూడా పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సైతం ఇంటి నుంచే పని చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

కాగా ప్రస్తుతం ఏపీలో 200కు పైనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5636కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 141 కేసులు ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించకపోగా.. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. అలాగే 2465 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories