ఇసుక అక్రమ తవ్వకాలు ఆపండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

ఇసుక అక్రమ తవ్వకాలు ఆపండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
x
Highlights

రాజస్థాన్‌లో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు బుధవారం సీరియస్ గా దృష్టి సారించింది.. దీనిని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం,...

రాజస్థాన్‌లో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు బుధవారం సీరియస్ గా దృష్టి సారించింది.. దీనిని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్లు మరియు ఎస్పీలను ఆదేశించింది. నాలుగు వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక తవ్వకాన్ని ఆపాలని చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అక్రమ ఇసుక తవ్వకం వల్ల పర్యావరణాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.

న్యాయమూర్తులు బిఆర్ గవై మరియు సూర్య కాంత్లతో కూడిన ధర్మాసనం అక్రమ ఇసుక తవ్వకాల సమస్యను పరిశీలించి, దానిని పరిష్కరించడానికి చర్యలు సూచించే నివేదికను సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీ (సిఇసి) ను నియమించింది. అంతేకాదు ఇసుక వ్యాపారులు, రవాణాదారులు మరియు ఇతర వాటాదారులు ఎదుర్కొంటున్న సమస్యను కూడా సిఇసి పరిశీలిస్తుందని, దర్యాప్తు జరిపే క్రమంలో ప్రభుత్వ అధికారులతో సహా ఏ వ్యక్తినైనా పిలిపించే అధికారం దీనికి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. సిఇసి తన నివేదికను ఆరు వారాల్లో సమర్పించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. రాజస్థాన్‌లో అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని 2017 లో సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories