Andhra Pradesh: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు

Andhra Pradesh: విజయవాడ GGHలో పెనుప్రమాదం తప్పింది. సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది ప్రాణాలను కాపాడారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.

Update: 2021-05-07 05:59 GMT

Andhra Pradesh: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు

Andhra Pradesh: విజయవాడ GGHలో పెనుప్రమాదం తప్పింది. సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది ప్రాణాలను కాపాడారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. విజయవాడ GGHలో ఆక్సిజన్ తో సుమారు నాలుగు వందల మంది కోవిడ్ భాదితులు చికిత్సపొందుతున్నారు. 18 టన్నుల తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో సంబంధాలు తెగిపోయాయి. విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసారు సంబంధిత అధికారులు. హుటాహుటిన రంగంలోకి దిగిన విజయవాడ సి.పి ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశారు.

ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని ప్రత్తిపాడు పోలీసులు గుర్తించారు. నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు. డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ప్రత్తిపాడు సిఐ అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి చేర్చారు పోలీసులు.

Tags:    

Similar News