నిమ్మగడ్డ ప్రజలకి సమాధానం చెప్పాలి : మంత్రి అవంతి

Update: 2020-06-23 14:26 GMT
Avanthi Srinivas (File Photo)

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ఈనెల 13న బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌‌లో ఈ సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి రహస్యంగా సమావేశం కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రతిపక్షనేత చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడుతున్నారు. నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఇలాంటి రాజకీయాలు గతంలో ఎపుడూ చూడలేదనీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు.

పాలన వికేంద్రీకరణ ప్రకటన తర్వాత భారీగా కుట్రలు పన్నుతున్నారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు నేరుగా మాతో యుద్దం చేసే ధైర్యం లేక దొడ్డిదారిన వస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో భూ అక్రమాలు జరిగాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఎన్ని‌కుట్రలకు పాల్పడినా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన కుట్రలేంటో బయతపెట్టలన్నారు.

సీఎం జగన్ ఏడాది కాలంలో 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చడంతో.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి విమర్శించారు. చంద్రబాబు కుట్రలతో వ్యవస్ధలని అదుపులో పెట్టుకుని రాష్ట్రాభివృద్దిని అడ్డుకోవడం తగదని హితవపలికారు. ఏడాదిగా బయటకి రాని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తన అనుచరుడు‌ కిషోర్ను సిఐడి‌ పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు వచ్చారో చెప్పాలన్నారు. ఈ కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో సీఐడీ కార్యాలయానికి వచ్చారని అన్నారు.


Tags:    

Similar News