అమరావతిపై FB పోస్ట్.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్‌పై.. ఏపీ ప్రభుత్వం వేటు
GST Official Suspended: అమరావతి ప్రాంతం వరదల్లో మునిగిపోయిందని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
GST Official Suspended: అమరావతి ప్రాంతం వరదల్లో మునిగిపోయిందని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదే మన డ్రోన్ కేపిటల్, క్వాంటం వాలీ, వెనకబడిన ప్రాంత నిధులు, ప్రజలమీద నిర్మించిన నగరం అతిపెద్ద రైల్వేస్టేషను, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని అంటూ సెటైర్లు విసిరారు.
ఫేస్ బుక్ పోస్ట్ను సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం సుభాష్‌ను వివరణ కోరుతూ మెమో జారీ చేసింది. వివరణలో పోస్ట్ నా వ్యక్తిగతం, నా ఇష్టం అంటూ సుభాష్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం సుభాష్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.