స్వ‌ర్ణం సాధించి రికార్డు సృష్టించారు : గ‌వ‌ర్న‌ర్

Update: 2020-08-31 05:39 GMT

Biswabhusan Harichandan: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) నిర్వహిచిన చెస్ ఒలంపియాడ్ లో భారత్ అనూహ్య విజయం సాధించింది. రష్యాతో కలిసి భారత్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ద‌క్కించుకుంది. కాగా, చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి స్వ‌ర్ణం గెలుచుకున్న భార‌త జ‌ట్టును ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ అభినందించారు. ఈ సంద‌ర్భంగా భార‌త క్రీడాకారులు విశ్వ‌నాథ‌న్ ఆనంద్, కొనేరు హంపీ, ద్రోణవల్లి హారిక, హ‌రికృష్ణ త‌దిత‌రులకు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. స్వ‌ర్ణం సాధించి కొత్త రికార్డు సృష్టించారంటూ క్రీడాకారుల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. పసిడి పతకం సాధించడం దేశానికికే గర్వకారణమన్నారు. చదరంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 93 ఏళ్ల చెస్‌ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. భారత్‌ను విజేతగా నిలపడంలో కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు.

Tags:    

Similar News