Pulse Polio: పోలియో రహిత సమాజమే మన ధ్యేయం- ఏపీ గవర్నర్
Pulse Polio: పోలియో రహిత సమాజమే మన ధ్యేయమని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
Pulse Polio: పోలియో రహిత సమాజమే మన ధ్యేయం- ఏపీ గవర్నర్
Pulse Polio: పోలియో రహిత సమాజమే మన ధ్యేయమని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. కొన్ని ఏళ‌్లుగా దేశంలో పోలియో కేసులు నమోదు కావడం లేదని ఆ పరంపరను ఇలాగే కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రాజ్ భవన్ దర్బార్ హాలులో గవర్నర్ పోలియో చుక్కల పంపిణీని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సుమారు 53 లక్షల పిల్లల కోసం 66.95 లక్షల డోసులు సిద్ధం చేశారని గవర్నర్ తెలిపారు.