Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు * అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు

Update: 2021-07-15 01:20 GMT

అగ్ర కులాలకు ఏపీ ప్రభుత్వం 10%  రెసర్వేషన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రవర్ణాలకు చెందిన పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యా, ఉద్యోగాల్లో ఈ 10 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతల మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. కుటుంబ వార్షిక ఆదాయం 8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయ పరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాలకు అధికారిక సమాచారం పంపినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అగ్రవర్ణాల పేదల కు చెందిన రిజర్వేషన్ల కోటా లో మహిళలకు కూడా మూడోవంతు కొటా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈడబ్ల్యు ఎస్ సర్టిఫికెట్ల జారీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లు, తహసీల్దార్ లకు ఆదేశాలు ఇచ్చారు.

Full View


Tags:    

Similar News