ఏపీలో రైలు ప్రయాణంపై ఆంక్షలు.. టికెట్టు సొమ్ము వాపస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు ప్రయాణంపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.

Update: 2020-06-02 13:39 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు ప్రయాణంపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. పలు ట్రైన్ ఆగకుండా వెళ్తుంది. కాబట్టి ప్రయాణికులు విరమించాలనుకునే వాళ్ళు టికెట్ డబ్బులు తిరిగి వాపసు ఇవ్వనున్నట్ల ప్రకటించింది.

సికింద్రాబాద్ -హౌరా ఫలక్ నుమా ట్రైన్ అగు స్టేషన్ లలో గుంటూరు ,విజయవాడ ను చేర్చి పిడుగురాళ్ల తాడేపల్లిగూడెం స్టేషన్ లను తొలగించారు. హౌరా -సికింద్రాబాద్ వచ్చే ఫలక్ నుమా ట్రైన్ లో ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్ లు అలాగే ఉంచి సామర్లకోట, పలాసా, ఇచ్చాపురం స్టేషన్ లను తొలగించారు.

అలాగే సికింద్రాబాద్-గుంటూరు మధ్య వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ లో విజయవాడ ని అలాగే ఉంచి కొండపల్లి, రైనాపాడు, కృష్ణ కెనాల్, మంగళగిరి, నంబూరు, పెద్ద కాకని స్టేషన్ లను తొలగించారు.

గుంటూరు -సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ మంగళగిరి విజయవాడ స్టేషన్ లను అలాగే ఉంచి , కొండపల్లి ,రాయణపాడు, నంబూరు పెద్దకాకని , స్టేషన్ లను తొలగించారు.

తిరుపతి -నిజామాబాద్ మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో కడప ,ఆదోని స్టేషన్ లను అలాగే ఉంచి రేణిగుంట ,కోడూరు ఓబులవారిపల్లి స్టేషన్ లను తొలగించారు. నిజామాబాద్ -తిరుపతి మధ్య రాయలసీమ ఎస్ప్రెస్ కడప గుంతకల్ స్టేషన్ లను అలాఫ్ ఉంచి కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనుర్లు,కొండపురం, తాడిపత్రి స్టేషన్లను తొలగించారు.

హైదరాబాద్ -విశాఖపట్నం, విశాఖపట్నం -హైదరాబాద్ మధ్య నడిచే ఈ 2 గోదావరి ఎక్స్ప్రెస్ లో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి స్టేషన్ లను అలాగే ఉంచి తాడేపల్లిగూడెం, నీడవదోలు, అనపర్తి , సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, యలమంచిలి, దువ్వాడా స్టేషన్ లను తొలగించారు.

ముంబై -భువనేశ్వర్ మధ్య నడిచే 2 కోనర్క్ ఎస్ప్రెస్ లో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ స్టేషన్ లను అలాగే ఉంచి తాడేపల్లిగూడెం, నీడవాదోలు, సామర్లకోట, పిఠాపురం, అనకాపల్లి, పలాసా, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్ లను తొలగించారు. 

Tags:    

Similar News