ఏపీలో మందుబాబులకు మరో భారీ షాక్..

ఏపీలో మందుబాబులకు మరో భారీ షాక్ తగిలింది.

Update: 2020-05-03 11:08 GMT

ఏపీలో మందుబాబులకు మరో భారీ షాక్ తగిలింది.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం వాడిన ట్రిక్.. షాపులు తగ్గించి, ధరలు పెంచడం.. ఇప్పటికే 20 శాతం మద్యం షాపులను తీసేసిన ప్రబుత్వం.. మధ్య నియంత్రణ దిశగా మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం ధరలు 25శాతం పెంచుతూ ఏపీ‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో లాక్ డౌన్ కారణంగా మందు దొరక్క ఇబ్బంది పడిన మందుబాబులు ఇప్పుడు ధరలు చూసి ఖంగుతినడం ఖాయంగా కనిపిస్తోంది.

మద్యం ధరలు 25 శాతం మేర పెంచి తాగేవారిని నిరుత్సాహపరిచి, దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య మరింత తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరుచుకోనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం స్పష్టం చేసింది. ఇక భౌతికదూరం పాటించడమే కాకుండా మాస్కులు ధరిస్తేనే మద్యం విక్రయించాలని షాపులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News