నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజురోజుకు మలుపులు తిరుగుతోంది.

Update: 2020-06-01 14:04 GMT
YS Jagan, Nimmagadda Ramesh Kumar (File Photo)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ జీవోలను కూడా కొట్టివేసింది. ఏపీ ఎస్ఈసీగా కనగరాజ్ నియామకం చెల్లదంటూ స్పష్టం చేసింది. నిమ్మగడ్డను పునర్‌ నియమించాలంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. . ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

కాగా.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో రాజకీయ దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అధికార , విపక్ష మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. జగన్ నియంత పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టని టీడీపీ నేతలు మండిపడుతుంటే... నిమ్మగడ్డకు అనుకూలంగా హైకోర్టులో తీర్పువస్తే టీడీపీ ఎందుకు సంబరాలు చేసుకుంటోందని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. తమ మనుషులు ఉంటే చాలని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.


Tags:    

Similar News