గుంటూరు, చిత్తూర్ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్ల తొలగింపు.. మాచర్ల సీఐ సస్పెన్షన్..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడం అంటే ఎన్నికలను అపహాస్యం చేయడమే అని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అన్నారు.

Update: 2020-03-15 05:05 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడం అంటే ఎన్నికలను అపహాస్యం చేయడమే అని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న గుంటూరు, చిత్తూర్ జిల్లాల ఎస్పీలను , కలెక్టర్లపై చర్యలు తీసుకుంటున్నట్టు రమేష్ కుమార్ స్పష్టం చేశారు.. వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు రమేష్ కుమార్ వెల్లడించారు. రాయదుర్గం పలమనేరు, మాచర్ల, తాడిపత్రి, తిరుపతి సీఐ లను విచారిస్తున్నామని.. మాచర్ల సీఐ ని తక్షణమే సస్పెండ్ చెయ్యాలని ప్రభుత్వానికి రమేష్ కుమార్ రికమెండ్ చేశారు. అలాగే శ్రీకాళహస్తి, పలమనేరు డిఎస్పీ లను బదిలీ చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు.  

Tags:    

Similar News