పారాసెటమాల్ సూచనపై స్పందించిన సీఎం జగన్ సోదరి డాక్టర్ సునీతారెడ్డి
భారతదేశంలో కరోనావైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి.
భారతదేశంలో కరోనావైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ అంటువ్యాధి తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రెండు కేసులు నమోదు అవ్వడంతో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనాపై పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, విదేశాల నుండి వచ్చే ప్రయాణికులు (ముఖ్యంగా కరోనా ప్రభావిత దేశాల నుండి వచ్చినవారు) వచ్చిన తేదీ నుండి 14 రోజులు ఇంట్లో ఉండాలని సూచించారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలవవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు వాలంటీర్లు పలు సూచనలు చేస్తున్నారు.
ఇదిలాఉండగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి అపోలో ఆసుపత్రి సీనియర్ డాక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి కరోనా వైరస్ గురించి కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆమె, నొప్పి, జ్వరం, దగ్గు వంటి కరోనరీ లక్షణాలు ఉన్నవారు పారాసెటమాల్ మందులు తీసుకోవాలని సూచన చేశారు. అలాగే14 రోజులపాటు ఎవ్వరిని కలవకుండా తమను తాము నిర్బంధించుకోవాలని సూచించారు. అలాగే కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని కోరారు. లక్షణాలు ఉన్నవారు చురుకుగా ఉండటానికి యోగా చేయాలని సూచించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నివారణ చర్యలు తీసుకోవాలని సునీతా రెడ్డి సూచించారు. కాగా సునీతా రెడ్డి హైదరాబాద్‌లో ఉత్తమ అంటు వ్యాధి వైద్య నిపుణురాలిగా గుర్తింపు పొందారు.