కాపు మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.15 వేలు ఆర్ధిక సాయం

మహిళల కోసం జగన్ సర్కార్ మరో పథకం తీసుకొచ్చింది. ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ అనే పథకానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

Update: 2020-06-24 02:30 GMT
YS Jagan (File Photo)

మహిళల కోసం జగన్ సర్కార్ మరో పథకం తీసుకొచ్చింది. 'వైఎస్సార్‌ కాపు నేస్తం' అనే పథకానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. కాపు నేస్తం పథకాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 

ఈ ఏడాది లబ్ధిదారులకు నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా తొలి ఏడాది దాదాపు 2,35,873 మంది మహిళలకు లబ్దిచేకురనుంది. 2019–20కి సంబంధించి ఈరోజు పథకాన్ని అమలు చేయనున్నారు.

ఈ పథకం 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు వర్తిస్తుంది. సుమారు రూ.354 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. నేరుగా వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమచేస్తారు. గ్రామ, వార్డు వలంటీర్ల వ్యక్తిగత తనిఖీలు, గ్రామ సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీక రిస్తారు.

ఈ పథకానికి అర్హత :

- కుటుంబ వార్షిక ఆదాయం.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించి ఉండరాదు.

- కుటుంబానికి మూడు ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట (ఖుష్కి) భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.

- పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు.

- కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే వర్తించదు.

- ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు.

- కారు, టాక్స్ చెల్లింపుదారులకు వర్తించదు. 

Tags:    

Similar News