ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం

Update: 2019-05-06 01:01 GMT

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న నిర్వహించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రివర్గ సమావేశం జరగదు. కానీ ఫోని తుఫాన్ బాధితులకు సహాయక చర్యలపై సమీక్ష, అకాల వర్షాలకు రైతులకు వాటిల్లిన నష్టం, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరా వంటి వివిధ సమస్యలపై చర్చించే అవకాశముంది. ప్రధాని నరేంద్ర మోదీ.... కోడ్‌ వచ్చిన తర్వాతే కేబినెట్‌ భేటీ నిర్వహించారు. చంద్రబాబు అదే దారిలో మంత్రివర్గ సమావేశాన్ని జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు సమావేశం నిర్వహణ ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆమోదించి మంత్రివర్గ సమావేశానికి పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోడ్ ఆమెలో ఉన్న సమయంలో సీఎస్ మంత్రివర్గ సమావేశానికి ఒకే చెప్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.  

Similar News