10th Exams 2021: షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు- మంత్రి సురేష్
AP 10th Exams 2021: ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
Andhra Pradesh: షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు- మంత్రి సురేష్
AP 10th Exams 2021: ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చామన్న మంత్రి.. వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పుటికే పరీక్షలు నిర్వహించాయన్నారు. జూన్ 1 నుంచి టీచర్లు విధులకు హాజరుకావాల్సిందిగా ఆదేశించామని తెలిపారు.