Anantapur: కంబదూరులో పూజారి వినూత్న నిరసన.. శ్రీ కమల మల్లేశ్వరస్వామి ఆలయానికి తాళం
Anantapur: ఏడు నెలలుగా ధూప దీప నైవేద్యాలకు అందని నిధులు
Anantapur: కంబదూరులో పూజారి వినూత్న నిరసన.. శ్రీ కమల మల్లేశ్వరస్వామి ఆలయానికి తాళం
Anantapur: అనంతపురం జిల్లా కంబదూరులో ఓ పూజారి వినూత్న నిరసన చేపట్టారు. శ్రీ కమల మల్లేశ్వరస్వామి ఆలయధూప దీప నైవేద్యాలకు ఎండోమెంట్ అధికారులు డబ్బులు చెల్లించడం లేదని గుడికి తాళం వేసి నిరసన తెలిపాడు. దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన భక్తులు ఆలయానికి తాళం వేసి ఉండడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. కంబదూరు మల్లేశ్వర స్వామితో పాటు తొమ్మిది ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు డబ్బులు చెల్లించడం లేదని పూజారి ఆందోళన వ్యక్తం చేశారు. ఏడు నెలలుగా ఎండోమెంట్ అధికారులు వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే పూర్తిస్థాయిలో ఆలయాల్లో అర్చన సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు.