Andhra Pradesh: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై ఏపీలో గందరగోళం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై గందరగోళం కొనసాగుతోంది.

Update: 2021-06-17 17:00 GMT

Andhra Pradesh: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై ఏపీలో గందరగోళం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై గందరగోళం కొనసాగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించే తీరుతామనే రీతిలో ప్రభుత్వం ముందుకెళ్తోంది. జులై ఫస్ట్‌ వీక్‌లో ఇంటర్‌ పరీక్షలు చివరి వారంలో టెన్త్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామనే సంకేతాలను సైతం ఇచ్చింది. దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్ధులు, 80వేల ఎగ్జామ్ స్టాఫ్‌తో ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. అయితే, కరోనా కాలంలో విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోబోమంటూ విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో, అసలు పరీక్షలు జరుగుతాయా? లేదా? అనే గందరగోళం కంటిన్యూ అవుతోంది. ఇంతకీ, టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై విద్యార్ధులు ఏమంటున్నారు? విద్యార్ధి సంఘాలు ఏమంటున్నాయి? టీచర్లు, పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? hmtv అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్ మీకోసం.

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గుచూపుతుంటే, విద్యార్ధుల జీవితాలతో ఆటలాడితే చూస్తూ ఊరుకోబోమంటూ విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. అయితే, పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు విద్యార్ధులు తాము పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నామంటుంటే కరోనా కల్లోలం కొనసాగుతుంటే పరీక్షలు ఎలా నిర్వహస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. స్కూల్‌లో పాఠాలు వింటేనే అంతంతమాత్రంగా చదువుతామని, అలాంటిది తూతూమంత్రంగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించి, ఇప్పుడు సడన్‌గా పరీక్షలు అంటే ఎలాగని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అయితే, విద్యార్ధుల భవిష్యత్‌కు పరీక్షలు ముఖ్యమే అయినా, అంతకంటే ప్రాణాలు విలువైనవి కదా అంటున్నారు విద్యార్ధి సంఘాల నేతలు. ఒకవేళ పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపితే, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ కండక్ట్ చేయాలని టీచర్స్ యూనియన్స్, పేరెంట్స్‌ సూచిస్తున్నారు.

కరోనా కల్లోలం కొనసాగుతున్నవేళ మూర్ఖంగా, మొండిగా పరీక్షలు నిర్వహించొద్దంటూ జగన్ ప్రభుత్వానికి సూచించారు టీడీపీ నేత దేవినేని ఉమ. థర్డ్‌ వేవ్‌‌లో పిల్లలకే ఎక్కువగా ముప్పు ఉంటుందంటూ హెచ్చరిస్తున్న సమయంలో విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని విపక్షాలు సూచిస్తున్నాయి.

ఇదిలాఉంటే, ఇంటర్‌, టెన్త్‌ పరీక్షల నిర్వహణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశా‌ఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమీక్షలోనూ పరీక్షల నిర్వహణ చర్చకు రాలేదని మంత్రి స్పష్టంచేశారు. ఇక, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తమకు తెలియదన్నారు. ఒకవేళ నోటీసులు అందితే, తమ స్టాండ్‌ ఏమిటో సుప్రీంకు తెలియజేస్తామని చెప్పారు.

Tags:    

Similar News