Ambati Rambabu: వరద తగ్గాక ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు వెళుతున్నాడు..
Ambati Rambabu: పోలవరం విషయంలో టీడీపీది తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.
Ambati Rambabu: వరద తగ్గాక ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు వెళుతున్నాడు..
Ambati Rambabu: పోలవరం విషయంలో టీడీపీది తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం జాప్యానికి కారణం జగన్ ప్రభుత్వం అని బ్రాండింగ్ చేయటానికి టీడీపీ, టీడీపీ మద్దతు మీడియా ప్రయత్నం చేస్తున్నదన్నారు. టీడీపీ ప్రభుత్వం దుర్మార్గం చేసిందని, కాఫర్ డ్యాం లేకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టిన ప్రబుద్ధులు టీడీపీ నేతలని అంబటి విమర్శించారు.
వరద తగ్గాక ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు వెళుతున్నాడు. తెలంగాణ మంత్రులు పోలవరం పై మాట్లాడుతున్నారు. దీని వలన నష్టం జరుగుతుందని చెప్పడం అవాస్తవం. అన్ని అంశాలు పరిశీలించాకే డిజైన్ల కు ఆమోదం తెలిపారు. పోలవరం ముంపు మండలాలను అందుకే ఏపీలో కలిపారు అని మంత్రి అంబటి తెలిపారు.