Ambati Rambabu: టీడీపీ చచ్చిపోయిన పార్టీ.. ప్రశాంత్ కిషోర్ శవపరీక్ష కోసం వచ్చాడు
Ambati Rambabu: చంద్రబాబును పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలవడంపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు.
Ambati Rambabu: టీడీపీ చచ్చిపోయిన పార్టీ.. ప్రశాంత్ కిషోర్ శవపరీక్ష కోసం వచ్చాడు
Ambati Rambabu: చంద్రబాబును పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలవడంపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ చచ్చిపోయిన పార్టీ అని, ప్రశాంత్ కిషోర్ శవ పరీక్ష కోసం వచ్చారని అంబటి ఎద్దేవా చేశారు. రాబిన్ సింగ్ పని అయిపోయింది కాబట్టే పీకేను తెచ్చుకున్నారని విమర్శించారు. ఆ పీకే ఈ పీకె ఏమి చేయలేరన్నారు. మెటీరియల్ బాగోలేనప్పుడు మేస్త్రి ఏం చేస్తాడని సెటైర్లు వేశారు అంబటి. గతంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పని చేసినప్పుడు లోకేష్ ఏమన్నాడో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. బీహార్ డెకాయిట్ వచ్చాడని, తోకలు కత్తిరిస్తాం అన్న లోకేష్..ఇప్పుడు అదే పీకేతో ఒప్పందం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు అంబటి.