Botsa Satyanarayana: సీఎం ఇంటిని ముట్టడిస్తామంటే ఊరుకోబోము..
Botsa Satyanarayana: సీపీఎస్ రద్దు కోరుతూ సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు ప్లాన్ చేస్తున్న ఉద్యోగులపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Botsa Satyanarayana: సీఎం ఇంటిని ముట్టడిస్తామంటే ఊరుకోబోము..
Botsa Satyanarayana: సీపీఎస్ రద్దు కోరుతూ సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు ప్లాన్ చేస్తున్న ఉద్యోగులపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించడమేంటని ఉద్యోగుల్ని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వ బాధ్యతని ఆయన అన్నారు. నిన్న చర్చలు జరపలేదన్నారు. ఈ విషయం ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే వారితో సమావేశమయ్యామని బొత్స తెలిపారు. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అన్ని శాఖల్లో అమలుచేస్తున్నట్లు బొత్స తెలిపారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు హమీ ఇచ్చాం ఆ మాట ప్రకారమే ముందుకెళ్తున్నామని తెలిపారు. ఉన్న సమస్యను అందరూ సానుకూలంగా అర్థం చేసుకోవాలి కోరారు.