నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డికి ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ తెలుపుతూ శనివారం బన్నీ ఇన్స్టాగ్రామ్లో ఓ లేఖను పోస్ట్ చేశారు. 'నా మిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలువడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు. అతన్ని ప్రజాసేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది.
నాకు ఆయన చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు. మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను. రాజకీయంగా మా ఇద్దరి దారులు వేరు అయినప్పటికీ.. నేను నా స్నేహితుని నూతన ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాన'ని బన్నీ పేర్కొన్నారు.