Asani Cyclone Updates: తీరం వైపు దూసుకువస్తున్న తుఫాన్

Asani Cyclone Updates: ఒడిశా, ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Update: 2022-05-11 02:00 GMT

తీరం వైపు దూసుకువస్తున్న తుఫాన్

Asani Cyclone Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ రెండు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. పెను తుఫాన్‌గా ఆవిర్భవించిన అనంతరం ఏపీ-ఒడిశా తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఏపీ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు ప్రకాశం, నెల్లూరుల్లో వర్షం పడుతోంది. ఇదే పరిస్థితి కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ కనిపిస్తోంది. అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తోన్నారు. ఒడిశాలోని గజపతి, కటక్, భువనేశ్వర్, పూరీ జిల్లాలపై అసానీ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. కోస్తాతో పాటూ ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. తీరం వెంట గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయి.

సముద్రపు అలలు కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే తీరప్రాంతాల ప్రజలు, మత్స్యకారులకు వాతావరణశాఖ, ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభుత్వం కూడా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే ఈరోజు పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. మొత్తం 37 రైళ్లు రద్దుయ్యాయి.

మరోవైపు అసని తుఫాన్ ముచ్చుకస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన పరీక్షను కూడా వాయిదా వేశారు. ఈ నెల 25న ఆ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఇంటర్‌ పరీక్షను వాయిదా వేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందుకే పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ దిశ మార్చుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. 

Full View


Tags:    

Similar News