ఏపీలో మందుబాబులకు గుడ్‌ న్యూస్.. మద్యం ధరలను తగ్గించిన ప్రభుత్వం

Update: 2020-09-03 12:24 GMT

ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీర్లపై బాటిల్‌కు 30 రూపాయలు తగ్గించింది. అదే సమయంలో ప్రీమియం లిక్కర్‌ ధరలను మాత్రం బాగా పెంచింది. 180 ఎంల్ బాటిల్ ధర రూ.120 మించని బ్రాండ్లకు రూ. 30 నుంచి రూ.120 రూపాయల వరకూ తగ్గించింది. క్వార్టర్ బాటిల్ ధరను రూ. 120 నుంచి రూ.150 వరకూ ధర ఉన్న బ్రాండ్లకు రూ.30 నుంచి రూ. 280 వరకూ తగ్గించింది. క్వార్టర్ బాటిల్ రూ. 150 నుంచి రూ. 190 మధ్య ఉన్న బ్రాండ్లకు ఎలాంటి ధర మార్పులు చేయలేదు. అన్ని బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 30 రూపయాల మేర ధర తగ్గించింది. రెడీ టూ డ్రింక్ మద్యం పై రూ. 30 మేర తగ్గింపు నిచ్చింది.

ఇవాళ్టి నుంచి సవరించిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు శానిటైజర్ తాగి చనిపోయారు. దీంతోపాటు తాజాగా హైకోర్టు కూడా మూడు బాటిళ్ల మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చీప్ లిక్కర్ ధరలను తగ్గించింది. ఆ మేర కాస్ట్ లీ బ్రాండ్ల ధరలు పెంచింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



 




Tags:    

Similar News