Modi-Akkineni Family: ప్రధాని మోదీతో అక్కినేని కుటుంబం భేటీ.. సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Update: 2025-02-08 01:30 GMT

Modi-Akkineni Family: పార్లమెంట్ లో అక్కినేని కుటుంబం, ప్రధానమంత్రి నేంద్రమోదీ మధ్య ప్రత్యేక భేటీ జరగడం హాట్ టాపిక్ గ్గా మారింది. ప్రధాని మోదీ ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావును ప్రస్తావించగా...ఆ సందర్బంగా నాగార్జున తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలో మోదీ వారిని భేటీకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో అక్కినేని కుటుంబ సభ్యులతోపాటు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.

ప్రధానితో భేటీకి ముందు నాగార్జున టీటీపీ పార్లమెంట్ ఆఫీస్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. భేటీ సమయంలో యార్లగడ్డ రచించిన అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అలాగే నాగార్జున తన కుమారుడు నాగచైతన్యను, నటి శోభితను మోదీకి పరిచయం చేశారు. కాగా మోదీ వారిని అభినందించి తండేల్ మూవీపై శుభాకాంక్షలు తెలిపారు.

ఇంట్రస్టింగ్ గా ఈ భేటీ తండేల్ సినిమా మూవీ విడుదల రోజునే జరగడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కినేని నాగార్జున కుటుంబం ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకోవడం రాజకీయ, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Tags:    

Similar News