Air India Service: జూలై 20 నుంచి గర్నవరం నుంచి మస్కట్‌కు విమాన సర్వీస్
Air India Service: జూలై 20 నుంచి ఒమాన్ దేశ రాజధాని మస్కట్‌కు డైరెక్ట్ విమాన సర్వీసును ఎయిర్‌ఇండియా ప్రారంభించనుంది.
Air India:(File Image)
Air India Service: ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గర్నవరం విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా జూలై 20 నుంచి ఒమాన్ దేశ రాజధాని మస్కట్‌కు డైరెక్ట్ విమాన సర్వీసును ఎయిర్‌ఇండియా ప్రారంభించనుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులను ఇపుడిపుడే పునరుద్దరిస్తున్నాయి.
ఎయిర్‌బస్ ఎ-21 విమానం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ఇక్కడి నుంచి బయలుదేరి ఒమాన్ దేశ కాలమాన ప్రకారం.. మస్కట్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని ఎయిర్‌ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే వారంలో ఒక రోజు మాత్రమే నడిచే ఈ సర్వీస్‌కు సంబంధించి ఆ సంస్థ ఇప్పటికే ప్రయాణ షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు టిక్కెట్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది.