Air India: ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

Air India: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.

Update: 2025-09-18 12:41 GMT

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరిన కొద్దిసేపటికే విమానం రెక్కలో పక్షి చిక్కుకుంది. దీంతో ఇంజిన్ ఫ్యాన్ దెబ్బతింది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి విశాఖపట్నం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికోసం ఎయిర్ ఇండియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News