AP News Today: ఏపీ సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ
AP News Today: * నూతన సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు * సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన సమీర్ శర్మ
ఏపీ సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ
AP News Today: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్‌లో సమీర్ శర్మకు సీఎస్ ఇంఛార్జ్‌ను అప్పగించారు ఆదిత్యనాథ్. ఇక సమీర్ శర్మకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు ఐఏఎస్ అధికారులు, సచివాలయ అధికారులు, ఉద్యోగులు ఆదిత్యనాథ్‌కు వీడ్కోలు పలికి, సమీర్ శర్మకు ఆహ్వానం పలికారు.
ఏపీ సీఎస్‌గా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు సమీర్ శర్మ. నవరత్నాల అమలు కోసం కృషి చేస్తానన్నారు. తన సర్వీస్‌లో చాలా మంది మంచి అధికారులతో కలిసి పనిచేశానన్నారు సమీర్ శర్మ. ఇక ఆదిత్యనాథ్ రిటైర్ కావడం లేదని, ఢిల్లీకి షిప్ట్ అవుతున్నారంటూ చమత్కరించారు. ఢిల్లీలో ఉంటూ ఏపీకి ఆదిత్యనాథ్ మరిన్ని సేవలందిస్తారన్నారు.
9 నెలల పాటు సీఎస్‌గా విధులు నిర్వర్తించారు ఆదిత్యనాథ్. టీమ్ వర్క్ నే తాను ఎప్పుడూ నమ్ముతానని, ఉద్యోగంలో ప్రతిరోజు తొలిరోజుగానే భావించేవాడినని అన్నారు ఆదిత్యనాథ్ దాస్. సెక్రటేరియట్‌లో విధుల నిర్వహణ, తీసుకునే నిర్ణయాలపై ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయన్నారు. రాష్ట్రానికి ఏ సేవలందించడానికైనా అందుబాటులో ఉంటానన్నారు ఆదిత్యనాథ్.