Adilabad: చలిలో.. చన్నీటి స్నానం.. విద్యార్థుల ఇబ్బందులు

Adilabad: వసతిగృహాల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయం

Update: 2023-12-23 05:38 GMT

Adilabad: చలిలో.. చన్నీటి స్నానం.. విద్యార్థుల ఇబ్బందులు

Adilabad: ఆదిలాబాద్ జిల్లా చలితో గజగజ వణికిపోతోంది.. రోజురోజుకు పతనమవుతున్న ఉష్ణోగ్రతలతో జనజీవనం పూర్తిగా ఇబ్బందులు పడుతుండగా, వసతిగృహాల్లో ఉండి.. చదువుకునే పేద విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లో వేడి నీళ్లు అందుబాటులో లేకపోవడంతో వేకువజామునే ఎముకలు కొరికే చలిలో చన్నీటి స్నానాలు చేస్తూ గజ గజ వణికిపోతున్నారు.

Tags:    

Similar News