YS Jaganmohan Reddy: వచ్చే నెల సీఎం జగన్ పర్యటన ఖరారు

Ys Jagan mohan Reddy: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జులై నెలలో కడప జిల్లా ఇడుపులపాయ లో పర్యటించనున్నారు.

Update: 2020-06-27 12:08 GMT
YS Jaganmohan Reddy file photo

Ys Jagan mohan Reddy: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జులై నెలలో కడప జిల్లా ఇడుపులపాయ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్నీ రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఇడుపులపాయలో వచ్చే నెల 7,8తేదీలలో జరిగే వివిధ అభివృద్ధి కార్యకమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పారు. వైఎస్సార్‌ ఆడిటోరియం, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అంతేకాదు ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీలో రూ.139 కోట్లతో నిర్మించిన ఏడు ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగాలను, తరగతి గదులను పరిశీలించారు. అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో ముఖ్యమంత్రి ఇడుపులపాయలో పర్యటిస్తారని.. పలు అభివుద్ది కార్యక్రాలకు శ్రీకారం చుడతారని అన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలకు అధునాత హంగులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉన్నతమైన సాంకేతిక విద్యనందించాలనే ఉద్ధేశంతో వీటిని మరింత పటిష్టంగా తయారుచేస్తున్నామని అన్నారు. రాష్టంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి అమ్మఒడి, నాడు- నేడు వంటి కార్యకమాలతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగానే 10 , ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్టు చెప్పారు. కాగా మంత్రి తోపాటు జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Tags:    

Similar News