Corona Effect : కరోనా ఎఫెక్ట్ : రోడ్డు పైన చెప్పులు అమ్ముకుంటున్న టీచర్ !

Corona Effect : కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పైన పడింది. అందులో విద్యారంగం ఒకటి.. కరోనా వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్

Update: 2020-08-31 11:06 GMT

Vijayawada 

Corona Effect : కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పైన పడింది. అందులో విద్యారంగం ఒకటి.. కరోనా వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. దీనితో ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. దీనితో కుటుంబ పోషణకి గాను కొందరు ఉపాధ్యాయుల వేరే పని చేసుకుంటున్నారు. అప్పట్లో ఓ ఉపాధ్యాయుడు రోడ్డు పైన అరటిపండ్లు అమ్ముకున్న సంగతి అందరికి తెలిసిందే.. ఇక తాజాగా విజయవాడకి చెందిన టి. వెంకటేశ్వరరావు అనే టీచర్ తన కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డుపై చెప్పులు అమ్ముకుంటున్నాడు.

విజయవాడలోని మూడు ప్రైవేటు స్కూళ్లలో వెంకటేశ్వరరావు పార్ట్ టైమ్ పద్ధతిలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు గణితం బోదించేవాడు. అయితే కరోనా వ్యాప్తి చెందడంతో వెంకటేశ్వరరావు ఆర్ధిక పరిస్థితి క్షిణించింది. ఈ విషయం జాతీయ మీడియాలో వచ్చింది. అయితే దీనిపైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫుల్ టైం ఉపాధ్యాయులకే పూర్తిగా శాలరీ ఇవ్వలేని పరిస్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని, ఇక నాలాంటి పార్ట్ టైమర్లని పట్టించుకోవడం లేదని దీనితో కుటుంబ పోషణకి గాను రోడ్డు పైన చెప్పులు అమ్ముకుంటున్నట్టుగా వెల్లడించాడు.

ఇక ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఆదివారం నాటికి ఉన్న సమాచారం మేరకు రాష్ట్రములో కొత్తగా 10,603 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 63,077 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,603 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 9,067 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి 4,24,767 కేసులు నమోదు అయ్యాయి.. 

Tags:    

Similar News