కొక్కొరోకో... కోళ్ళు ఫ్రీ..ఫ్రీ.. ఫ్రీ

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది.

Update: 2020-03-13 04:34 GMT
a poultry merchant distributed two thousand Hens

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇక భారత్ లో ఇప్పటికి 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమా హాల్స్, హోటల్స్, స్టాక్ మార్కెట్ ఇలా అన్నింటిపైన పడింది..

ఇక వైరస్ ఇంతలా ప్రజలను భయపెడుతూ ఉండడంతో చికెన్, మటన్ తినాలంటే ప్రజలు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ వైరస్ జంతుమాసం నుంచి ఎక్కువగా వస్తుందన్న ప్రచారం బాగా సాగడంతో చికెన్ రేట్స్ కూడా భారీగానే పడిపోయాయి. అంతకుముందు 200 లకి పలికిన చికెన్ ధర ఇప్పుడు 40 మాత్రమే పలుకుతుంది.

ఈ నేపద్యంలో కృష్ణా జిల్లా మైలవరం మండలం చిలుకూరివారిగూడేనికి చెందిన పౌల్ట్రీ వ్యాపారి గువ్వల కుమార్‌రెడ్డి గురువారం తన ఫారంలోని 2 వేల కోళ్లను సమీప గ్రామాల వారికి ఉచితంగా పంచారు. వైరస్ ప్రభావం వలన ధర లేకపోవడం వలన తనకి రూ.10 లక్షల దాకా నష్టం వాటిల్లిందని గువ్వల కుమార్‌రెడ్డి వాపోయాడు..

ఇక సుమారు 125 దేశాలకు ఈ కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం లక్షా 30వేల 237 కేసులు నమోదయ్యాయి. అందులో 68వేల 677 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 56వేల 804 మంది చికిత్స పొందుతున్నారు. 5వేల 714 మందికి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా వెయ్యి 600 కేసులు నమోదయినట్లు సమాచారం. కరోనాతో మొత్తం ఇప్పటి వరకు 4వేల 756 మంది మృతి చెందినట్లు సమాచారం.

Tags:    

Similar News