Prathipati Pulla Rao: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి
*పెన్షన్ పెంచుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం *అర్హత ఉన్న వారిని తొలగిస్తున్నారని ఆరోపణ
ప్రత్తిపాటి పుల్లారావు (ఫోటో ది హన్స్ ఇండియా )
Prathipati Pulla Rao: ప్రతీ ఏటా 250 రూపాయల చొప్పున పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం అర్హత ఉన్న పెన్షన్లను తొలగిస్తోందని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితుల తరపు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారి హక్కులను కాలరాస్తూ వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని విమర్శించారు.