Rain Alert: తీరం దాటిన వాయుగుండం.. మరో 24 గంటలు భారీ వర్షాలు..!
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటింది. 24గంటల పాటు భారీ వర్షాలు.
Rain Alert
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటింది. ఛత్తీస్‌ఘడ్ - విదర్భ మీదుగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడుతోంది. దక్షిణ ఓడిశా ఉత్తరాంధ్ర మధ్య ద్రోణి కొనసాగుతుండగా దీని ప్రభావంతో మరో 24గంటల పాటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలపారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏలూరు జిల్లాలోని రాములేరు వాగు పొంగడంతో వరద నీరు పలు గ్రామాల్లోని ఇళ్లల్లోకి ప్రవేశించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలిస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు