గుడి ముందు అడుక్కొని మళ్ళీ అదే గుడికి 8 లక్షల విరాళం

పుణ్యక్షేత్రాలు ముందు అడుక్కొనే వారిని మనం చాలా మందిని చూసుంటాం.. అలా వచ్చిన డబ్బులతో తమకి తామను నమ్ముకున్న వారి ఆకలిని తీరుస్తారు.

Update: 2020-02-14 12:12 GMT

పుణ్యక్షేత్రాలు ముందు అడుక్కొనే వారిని మనం చాలా మందిని చూసుంటాం.. అలా వచ్చిన డబ్బులతో తమకి తామను నమ్ముకున్న వారి ఆకలిని తీరుస్తారు. కానీ ఓ భిక్షగాడు మాత్రం ఏ గుడి దగ్గర అయితే తానూ భిక్షాటన చేసాడో అదే గుడికి ఏకాంగా ఎనమిది లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

విజయవాడ ముత్యాలంపాడులోని షిర్డీ సాయిబాబు గుడి ముందు యాదిరెడ్డి అనే బిక్షగాడు భిక్షాటన చేసేవాడు. అలా వచ్చిన డబ్బులను పోగు చేసేవాడు.. అలా పోగు చేసిన డబ్బులను మళ్ళీ అదే గుడికి విరాళంగా ఇచ్చాడు. అల ఆ ఆలయానికి కొన్నేళ్లలో 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. నిజానికి 75 ఏళ్ళు ఉన్న యాదిరెడ్డి ఒకప్పుడు రిక్షా తొక్కేవాడు. కానీ వయసు మీదా పడడంతో రిక్షా తొక్కడం ఆపేశాడు.


ఆ తర్వాత విజయవాడలోని పలు ఆలయాల ముందు భిక్షాటన చేస్తూ డబ్బును పోగు చేస్తూ మళ్ళీ అదే ఆలయాలకు ఆ డబ్బును విరాళంగా ఇచ్చాడు. ఇలా ఆలయానికి విరాళంగా ఇచ్చినప్పుడు భక్తులలో నాపై గౌరవం పెరిగిందని యాదిరెడ్డి చెప్పుకొచ్చాడు. యాదిరెడ్డి కేవలం ఈ ఒక్క ఆలయానికి మాత్రమే కాదు ఇంకా చాలా ఆలయాలకి విరాళాలు ఇచ్చాడు. తన జీవితాంతం దేవుడి సన్నిధిలోనే గడిపెస్తానని యాదిరెడ్డి చెప్పుకొచ్చాడు.  

Tags:    

Similar News