సోమశిల జలాశయం లో 68,283 టీఎంసీల నీటి నిల్వ

మండలంలోని సోమశిల జలాశయంలోకి, పై తట్టు ప్రాంతాల నుండి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

Update: 2019-11-25 05:40 GMT
సోమశిల జలాశయం

అనంతసాగరం:మండలంలోని సోమశిల జలాశయంలోకి, పై తట్టు ప్రాంతాల నుండి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయానికి 3322 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.ప్రస్తుతం జలాశయంలో 68,283 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సోమశిల జలాశయం నుండి కండలేరు జలాశయానికి, వరద కాలువ ద్వారా 2500 క్యూసెక్కులు, పెన్న డెల్టాకు 900 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 550 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 200 క్యూసెక్కులు, 17,18, రివర్ స్లూయిజ్ ల ద్వారా 50 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. 344 క్యూసెక్కులు ఆవిరి రూపంలో వృధా అవుతోంది.

Tags:    

Similar News