సోమశిల జలాశయంలో 67,662 టీఎంసీల నీటి నిల్వ
మండలంలోని సోమశిల జలాశయంలోకి, పై తట్టు ప్రాంతాల నుండి వరద ప్రవాహం 4570 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.
అనంతసాగరం: మండలంలోని సోమశిల జలాశయంలోకి, పై తట్టు ప్రాంతాల నుండి వరద ప్రవాహం 4570 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయంలో 67,662 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సోమశిల జలాశయం నుండి కండలేరు జలాశయానికి, వరద కాలువ ద్వారా 2100 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 550 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 200 క్యూసెక్కులు, పెన్నడెల్టాకు 2950 క్యూసెక్కులు, 17,18, రివర్ స్లూయిజ్ ల ద్వారా 50 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. 150 క్యూసెక్కులు ఆవిరి రూపంలో వృధా అవుతోంది.