Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు, 41మంది మృతి
Corona Cases in AP: ఏపీలో గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు, 41మంది మృతి
Corona Cases in AP: ఏపీలో గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 91వేల 231 పరీక్షలు చేయగా 3వేల 620 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక కొత్తగా 41మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దాంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ‌్య 12వేల 671కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18లక్షల 85వేల 716కి చేరగా ఇప్పటివరకు కోవిడ్ నుంచి 18లక్షల 32వేల 971 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 40వేల 74 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇక గత 24గంటల్లో కరోనా మహమ్మారితో రాష్ట్రవ్యాప్తంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఏడుగురు మృత్యువాత పడగా కృష్ణా జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. తూర్పోగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. అలాగే శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపురం, విశాఖలో ఇద్దరు చొప్పున, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.