Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,464 కరోనా కేసులు, 34 మంది మృతి
Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3,464 కరోనా కేసులు, 34 మంది మృతి
Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93 వేల 759 శాంపిల్స్‌ని పరీక్షించగా 3 వేల 464 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 18 లక్షల 96 వేలు దాటినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి మరో 4 వేల 284 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 18 లక్షల 46 వేలు దాటింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 37 వేల 323 యాక్టివ్ కేసులున్నాయి.
మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో మరో 34 మంది మృతి చెందారు. కోవిడ్ తో చిత్తూరు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరులో నలుగురు, కృష్ణా, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఇద్దరు, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణాలు సంభవించినట్టు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.