కల్తీ నాయకులు ఏలుతున్న కలియుగం..ఎవరినీ నమ్మొద్దు పృథ్వీ వీడియో వైరల్

హాస్య నటుడు, ఎస్వీబీసీ ( శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ) మాజీ ఛైర్మన్ పృథ్వీ రాజ్ మరోసారి వార్తల్లోకి నిలిచారు.

Update: 2020-04-27 12:51 GMT
YS Jaganmohan Reddy, prudhvi raj

హాస్య నటుడు, ఎస్వీబీసీ ( శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ) మాజీ ఛైర్మన్ పృథ్వీ రాజ్ మరోసారి వార్తల్లోకి నిలిచారు.పృథ్వీ టిక్ టాక్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. పృథ్వీ వ్యాఖ్యలను టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇటీవలే ఎస్వీబీసీ ఛైర్మన్‌ హోదాలో ఆయన ఓ మహిళా ఉద్యోగినితో అసభ్య కరమైన ఫోన్ సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఆడియో టేప్ లో పృథ్వీ జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పృథ్వీ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చెప్పారు. దీంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను అన్యాయంగా ఇరికించారు అని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి పృద్వి వైసిపి తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొనలేదు.

తాజాగా పృథ్వీరాజ్ టిక్ టాక్ వీడియోలో .. కల్తీ నాయకుల కాలమిది, ఎవరినీ నమ్మొద్దు అని పృథ్వి చేసిన టిక్ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టిడిపి కార్యకర్తలు అయితే వైసీపీని వీడి బయటకు వచ్చారో చెప్పాలని అడుగుతున్నారు. ఇక ఆ వీడియో వైసీపీ నాయకులను ఉద్దేశించే చేశారని, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కల్తీ నాయకులు అంటే ఎవరూ..? వైసీపీ నుంచి పృథ్వీరాజ్ ఎప్పుడు బయటకు వచ్చారో? అని ప్రశ్నిస్తున్నారు.

ఆ వీడియోలో 30 ఇయర్స్ పృథ్వి రాజ్ 'మన అని ఎవరినీ నమ్మొద్దు. ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం. మన ముందు మన మాట మాట్లాడతారు. వాడి ముందు వాడి మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి'. అంటూ ఆయన వీడియో చేశారు. అయితే టిడిపి కార్యకర్తలు ఊహాగానాలకు తెరదించాలంటే పెట్టాలంటే దీనిపై పృథ్వీరాజ్ స్పందించాల్సి ఉంది.



Tags:    

Similar News