Corona Cases in AP: ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు
Corona Cases in AP: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి.
Corona Cases in AP: ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు
Corona Cases in AP: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. గత 24గంటల్లో 71వేల 152మందికి పరీక్షలు నిర్వహించగా 16వందల 28మందికి కరోనా సోకినట్లు తేలింది. అయితే, రోజువారీ మృతుల సంఖ్య మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. గడిచిన 24గంటల్లో 22మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో, ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13వేల 154కి చేరుకుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 23వేల 570 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణాజిల్లాలో నలుగురు మరణించగా గుంటూరు, ప్రకాశంలో ముగ్గురు చొప్పున మృత్యువాత పడ్డారు. అలాగే, అనంతరంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.