Tanuku: తణుకు మున్సిపల్ చైర్మన్ పీఠం మాదే: వడ్లూరి సీతారాం

Tanuku: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తణుకు మున్సిపాలిటీలోని 44 వార్డుల్లో పోటీ చేసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని వైసీపీ నేత వడ్లూరి సీతారాం ధీమా వ్యక్తం చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 12 Oct 2026 7:55 PM IST
Tanuku
X

Tanuku: తణుకు మున్సిపల్ చైర్మన్ పీఠం మాదే: వడ్లూరి సీతారాం

తణుకు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తణుకు మున్సిపల్ పరిధిలో 44 వార్డుల్లో వైకాపా తరపున పోటీ చేసి చైర్మన్‌ పదవిని కైవసం చేసుకుంటామని వైసీపీ నాయకుడు వడ్లూరి సీతారాం ధీమా వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి గడిచిన రెండున్నరేళ్లలో తణుకు అభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టి, డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానంద్వారాలబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రూ.3.76 లక్షల కోట్ల అప్పులు చేసి, వాటిని స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపించారు.

నిత్యావసర వస్తువుల ధరలుఆకాశాన్నంటి సామాన్య ప్రజల జీవన పరిస్థితి దుర్భరంగా మారిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపే శ్రద్ధ సూపర్ సిక్స్ పథకాల అమలులో చూపించాలని సవాల్ చేశారు.

రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మద్దతు ఇచ్చి విజయాన్ని అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తణుకు నియోజవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)