Penumantra: భట్లమగుటూరు సర్పంచ్ బరిలో ఈది సంధ్య.. మంచం గుర్తుపై ప్రచారం

Penumantra: పెనుమంట్ర మండలం భట్లమగుటూరు సర్పంచ్ అభ్యర్థిగా ఈది సంధ్య ప్రచారం; మౌలిక సదుపాయాలు, మాజీ మంత్రి రంగనాథ రాజా ఆశీస్సులపై ధీమా.

E.ABRAHAM, ACHANTA
Published on: 23 Nov 2026 9:29 PM IST
Penumantra
X

Penumantra: భట్లమగుటూరు సర్పంచ్ బరిలో ఈది సంధ్య.. మంచం గుర్తుపై ప్రచారం

పెనుమంట్ర: పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈది సంధ్య బరిలోకి దిగారు. వైసిపి నాయకులు ఈమె పోటీకి మద్దతు పలికారు. ఇప్పటికే గ్రామంలో తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంధ్య, తనకు కేటాయించిన మంచం గుర్తుపై గ్రామ ప్రజలు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

తాను సర్పంచ్ గా విజయం సాధించాక గ్రామంలో రహదారులు,త్రాగునీరు, వీధి లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజారిటీ వస్తుంది అని నమ్మకం ఉందని, చతుర్ముఖ పోటీలో తనను గెలిపించాలని కోరారు.

తాను గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని, అభివృద్ధిని గ్రామంలో పరుగులు పెట్టిస్తానని వివరించారు. మాజీ మంత్రి రంగనాథ రాజా ఆశీస్సులతో తాను తప్పక విజయం సాధిస్తానని ఈది సంధ్యా ఆశభావం వ్యక్తం చేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA